Maoists surrender| మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ..15మంది లొంగుబాటు
చత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 15మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
విధాత : చత్తీస్ గఢ్( Chhattisgarh)లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా(Sukma district) పోలీసుల ఎదుట 15మంది మావోయిస్టులు లొంగిపోయారు(Maoists surrender). లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన 15 మంది మావోయిస్టులపై.. 48లక్షల రూపాయల రివార్డ్ ఉందని..అది వారికే అందిస్తున్నామని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ ఛాహ్నా తెలిపారు. తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, మహారాష్ట్రాలలో వరుసగా మావోయిస్టుల లొంగుబాటు, ఎన్ కౌంటర్లతో ఆపరేషన్ కగార్ జోరుగా సాగుతుండటంతో మావోయిస్టు పార్టీ రోజురోజుకు వరుస ఎదురుదెబ్బలు తింటుంది. మార్చి మాసాంతానికి మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ ను ముమ్మరం చేశాయి.
మరోవైపు నయీమెడ్, భోపాల్‌పట్నం పోలీసులు నిర్వహించిన వేర్వేరు ఆపరేషన్లలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి బాంబుల తయారీ సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా..ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని, ఫిబ్రవరి 15వరకు సమయం ఇవ్వాలని, కూంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేత ప్రకటన చేస్తే..ఆ వెంటనే జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్దంగా ఉన్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ కమిటీ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram