Revanth Reddy invites PM Modi| గ్లోబల్​ సమ్మిట్ కు రండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Revanth Reddy invites PM Modi| గ్లోబల్​ సమ్మిట్ కు రండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

విధాత : అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలంటూ ప్రధాని మోదీని(PM Modi) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రత్యేకంగా ఆహ్వానించారు (invites) . ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపార్లమెంట్​లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు.

కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ..​ 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్​ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్​ ను గ్లోబల్​ సమ్మిట్​ లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణ రైజింగ్​ విజన్​లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

అభివృద్ది పనులకు అనుమతులివ్వండి

హైదరాబాద్​ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని ప్రధానిని రేవంత్ రెడ్డి కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిందని, రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ రీజనల్ రింగ్​ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్​ ఆమోదంతో పాటు ఫైనాన్సియల్ అప్రూవల్​ ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్​ రింగ్​ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​ నుంచి అమరావతి మీదుగా బందర్​ పోర్ట్ వరకు 12 లేన్​ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, హైదరాబాద్​ నుంచి బెంగుళూరు హై స్పీడ్​ కారిడార్​ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్​ రిజర్వ్ మీదుగా మన్ననూర్​ నుంచి శ్రీశైలం వరకు ఫోర్​ లేన్​ ఎలివేటేడ్​ కారిడార్​ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం ప్రధానికి వినతిపత్రం అందించారు.