CM Revanth Reddy| సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

CM Revanth Reddy| సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్( Meenakshi Natarajan) శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితోమీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud)లు భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వారు ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది.

ఇదే రోజు జరుగబోతున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీలో చర్చించాల్సిన అంశాలపై వారు చర్చించినట్లుగా సమాచారం. కాగా నిన్న మీనాక్షి నటరాజన్ అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో తన బృందంతో ఆకస్మికంగా పర్యటించి ఆరు గ్యారంటీల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో తాజా భేటీలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి చర్చించవచ్చని తెలుస్తుంది.