Vandemataram | 7న ప్రజలంతా వందేమాతరం గేయం ఆలపించాలి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 దేశ ప్రజలంతా ఒక నిర్ణీత సమయంలో వందేమాతర గేయం ఆలపించాలని కోరింది.
విధాత :
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 దేశ ప్రజలంతా ఒక నిర్ణీత సమయంలో వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, సీఎం నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్థులు ఇందులో పాల్గొనేలా చూడాలని తెలిపింది. కేంద్రం ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటోంది.
దీని కోసం రాష్ట్ర నోడల్ అధికారిగా భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జున రావును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. విద్యాలయాల్లో, జిల్లాల్లో, మండల స్థాయి వరకు అన్ని చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు జారీ చేసింది. సామూహిక గేయ ఆలాపన కోసం అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్ధిష్ట కార్యాచరణను రూపొందించనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram