Vande Mataram 150th Anniversary | వందేమాతరం.. భారత మాత ఆరాధన మంత్రం : ప్రధాని మోదీ

వందేమాతరం భారత మాత ఆరాధన మంత్రం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Vande Mataram 150th Anniversary | వందేమాతరం.. భారత మాత ఆరాధన మంత్రం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : వందేమాతరం గేయం ఒక స్వప్నం.. ఒక సంకల్పం.. భారత మాత మంత్రం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. వందేమాతరం గేయం దేశమాత ఆరాధన, సాధన..వందేమాతరం మనల్ని పురాణ, ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుంది..వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందని..భవిష్యత్తుకు భరోసా నిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవం వేడుకల్లో భాగంగా సామూహిక వందేమాతరం గేయ ఆలాపన చేశారు. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవం. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది అని అన్నారు.

వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశాం అని.. ప్రతి గీతానికి ఒక మూలభావం, సందేశం ఉంటుందని.. మన వందేమాతరం మూల భావం భారత్‌, మా భారతి’’ అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో విభిన్న మతాలు, రాష్ట్రాలు, సంస్కృతికి చెందిన కోట్ల మంది భారతీయుల్లో ఏకతా స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ జాతిని సంఘటితం చేసి ఏకం చేసే గొప్ప మంత్రం అని మోదీ అన్నారు. నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం.. తొలిసారి ఛటర్జీ రాసిన ‘ఆనంద్‌ మఠ్‌’ నవలలో ప్రచురితమైంది. ‘వందేమాతరం’ గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.