Vandemataram Song | వివాహ వేడుకలో వందేమాతర గీతాలపన
వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మిసాయిల వివాహం శుక్రవారం జరిగింది.
విధాత, వరంగల్ :
వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మిసాయిల వివాహం శుక్రవారం జరిగింది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు హక్కులను పొందినట్లే ప్రాథమిక విధులను అదేశిక సూత్రాలను పాటించాలనే ఉద్దేశ్యంతోనే వివాహ వేడుకల్లో వందేమాతరం ఆలపించామని పెళ్ళిపెద్దలు తెలిపారు. వివాహ వేడుకల్లో దేశభక్తితో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల పలువురు అధికారులు, ప్రముఖులు అభినందలు తెలిపారు. కాగా, వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థల్లో వందేమాతరం గేయం ఆలపించాలని కోరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram