వైరల్..డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వాటర్ ట్రబుల్!

తాగడానికి నీళ్లు లేక, స్థానిక అధికారులు పట్టించుకోక.. మండుటెండల్లో బావుల్లోకి దిగి, నీళ్ల కోసం పోరాడుతున్న చిన్నారుల తాగునీటి తండ్లాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యం కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా, రేఖ్లియా జిరా ఫలియాలోని సర్బద్ గ్రామంలో కావడం గమనార్హం.

వైరల్..డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వాటర్ ట్రబుల్!

విధాత : తాగడానికి నీళ్లు లేక, స్థానిక అధికారులు పట్టించుకోక.. మండుటెండల్లో బావుల్లోకి దిగి, నీళ్ల కోసం పోరాడుతున్న చిన్నారుల తాగునీటి తండ్లాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యం కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా, రేఖ్లియా జిరా ఫలియాలోని సర్బద్ గ్రామంలో కావడం గమనార్హం. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ది పరుగుతీస్తుందన్న బీజేపీ నేతలు మాటలకు ఈ గ్రామంలోని ప్రజలు, చిన్నారులు పడుతున్న తాగునీటి కష్టాలు చెంప పెట్టులా కనిపిస్తున్నాయి.

లోతైన బావులలో అడుగంటిన భూగర్భ జలాలను తాగేందుకు బిందెలు, పాత్రాలు, డబ్బాలలో పైకి తెచ్చుకునేందుకు ఆ గ్రామంలోని చిన్నారులు దుస్సాహసంగా..సర్కస్ ను తలపించేలా ఉంది. వారు బావిలోని నీళ్లను పైకి తీసుకొచ్చేందుకు పడుతున్న తిప్పలు పర్వాతారోహాకుల సాహసం కంటే అధికంగానే ఉండటం విశేషం. మనసుల్ని బరువెక్కించే ఈ దృశ్యాలను చూసైనా పాలకులు అక్కడి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని నెటిజన్లు కోరుతున్నారు.