Falaknuma Express| ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులు..రైలు ఆపి తనిఖీలు
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో రైలును ఆపి ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించారు.
విధాత, హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) రైలులో ఉగ్రవాదులు(Terrorist Alert) ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో(Ghatkesar Railway Station) రైలును ఆపి ప్రత్యేక బృందాలు తనిఖీ(Checks)లు నిర్వహించారు. చర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్‌కేసర్ పోలీసులు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ నుంచి ఆర్పీఎఫ్ కు అందిన సమాచారంలో అప్రమత్తమైన పోలీస్ బృందాలు రైలు అన్ని బోగీలలోని ప్రయాణికులును చెక్ చేశారు. ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా అనుమానాస్పదంగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ.. వస్తువులు కానీ లేకపోవడంతో.. ప్రయాణికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రత విభాగానికి అందిన సమాచారాన్ని ఫేక్ కాల్ గా పోలీసులు నిర్దారించారు. తనిఖీల సందర్భంగా రైలు నిలిపివేయడం..అదే సమయంతో వర్షం పడుతుండటంతో ప్రయాణికులు.. ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి పలువురు స్లీపర్ సెల్స్‌తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్న నేపధ్యంలో సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై రైలులో తనిఖీలు చేపట్టాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram