FASTag Rules| ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్
ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. జాతీయ రహదారులపై ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టింది.
విధాత : ఫాస్ట్ ట్యాగ్ లేని(FASTag) వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. జాతీయ రహదారులపై ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల(Toll Payment) వద్ద ఇప్పటివరకు సాధారణ రుసుంకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధన సడలించింది. కొత్త నిబంధన మేరకు ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులు సాధారణ టోల్ ఛార్జ్ కంటే 1.25 రెట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే రెండో నిబంధనలో.. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ రూ. 3,000 చెల్లించి, 200 టోల్ ప్లాజాల దాటింపులు లేదా ఒక సంవత్సరం కాలపరిమితి (ఏది ముందుగా వస్తుందో) వరకు వాడుకోవచ్చు. ఈ పాస్‌ను ఎన్ హెచ్ఏఐ (NHAI)అధికారిక వెబ్‌సైట్, రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. కాగా ఈ రెండు కొత్త నిబంధనలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram