Fee Reimbursement | చర్చలు సఫలం.. తెరుచుకోనున్న విద్యాసంస్థలు
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విచయవంతం అయ్యాయి. శుక్రవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం (పాతి) ప్రతినిధులతో చర్చలు జరిపారు.
విధాత, హైదరాబాద్ :
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విచయవంతం అయ్యాయి. శుక్రవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం (పాతి) ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామితో విద్యాసంస్థల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో రేపటి(శనివారం) నుంచి ఉన్నత కళాశాలలు తెరుచుకోనున్నాయి. నిరసన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకున్నట్టు ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం (పాతి) ప్రకటించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, చర్చల సందర్భంగా కళాశాల యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి 1,500 కోట్లు అడిగినట్టు తెలిపారు. ఇప్పటికే 600 కోట్ల రూపాయలు విడుదల చేశామని.. మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని.. మిగిలిన రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని భట్టి హామీనిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు త్వరలో ఒక కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన కమిటీ నివేదిక వచ్చేలా చేస్తామని వివరించారు. ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే పాతి అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ మాట్లాడుతూ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన పైకానీ, సీఎం కార్యాలయం అధికారులపై, డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదన్నారు. మీడియా సమావేశంలో ఒకటి మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించాయని పేర్కొన్నారు. మా మాటలను వక్రీకరిస్తూ మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ తమ సంఘం నుంచి ఓ ప్రకటనను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. మూడవ తేదీ నుంచి సమ్మెకు వెళ్లడతో కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు చింతిస్తున్నామన్నారు. నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అయినందున రేపటి లెక్చరర్ల ప్రదర్శనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ సమయంలో లెక్చరర్ల ప్రదర్శన తప్పు అని కోర్టు చెప్పినట్లు రవికుమార్ వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram