అటవీ సిబ్బంది అప్రమత్తం..ఏనుగుల గుంపుకు తప్పిన రైలు ముప్పు

అస్సాంలో ఓ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతున్న సందర్బంలో ఆ మార్గంలో రైలు రావడాన్ని గమనించిన ఫారెస్టు సిబ్బంది వెంటనే రైలుకు ఎదురువెళ్లి అలర్ట్ సిగ్నల్ ఇవ్వడం..ఆ ఏనుగుల ప్రాణాలను దక్కించిన ఘటన వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 20, 2026, 10:47 am IST
Read Time: 4 mins
అటవీ సిబ్బంది అప్రమత్తం..ఏనుగుల గుంపుకు తప్పిన రైలు ముప్పు

విధాత: భారత్ లో ఏనుగులు మరణాలు అవి గుంపులుగా రైల్వే ట్రాక్ లు దాటుతున్న సందర్భాల్లోనే ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రభుత్వాలు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికి..మానవ అప్రమత్తత కూడా కీలకంగా మారుతుంది. తాజాగా ఓ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతున్న సందర్బంలో ఆ మార్గంలో రైలు రావడాన్ని గమనించిన ఫారెస్టు సిబ్బంది వెంటనే రైలుకు ఎదురువెళ్లి అలర్ట్ సిగ్నల్ ఇవ్వడం..ఆ ఏనుగుల ప్రాణాలను దక్కించిన ఘటన వైరల్ గా మారింది.

అస్సాం రాష్ట్రం నాగావ్ లో రైల్వే ట్రాక్ పై రాజధాని ఎక్స్ ప్రెస్ వెలుతున్న మార్గంలో దాదాపు 30వరకు ఉన్న ఏనుగుల గుంపు ట్రాక్ ను ధాటుతున్నాయి. దీనిని గమనించిన ఫారెస్ట్ సిబ్బంది అటుగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి అలర్ట్ సిగ్నల్ చూపి…లోకో పైలట్ ను అప్రమత్తం చేశాడు. వెంటనే లోకో పైలట్ రైలును ఆపివేయగా..ఏనుగుల గుంపు సురక్షితంగా ట్రాక్ దాటి వెళ్లింది. ఆ తర్వాత రైలు తిరిగి ప్రయాణం కొనసాగించింది. అస్సాం అటవీ శాఖ, రైల్వే యంత్రాంగం సమన్వయం..అప్రమత్తతో విలువైన ఏనుగుల ప్రాణాలను రైలు ప్రమాదం నుంచి కాపాడటానికి సహాయపడింది.

అస్సాంలో ఏనుగుల సంరక్షణ కోసం రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు అమలు చేస్తుంది. ఏనుగు కారిడార్లను గుర్తించి, ఏనుగులు రైల్వే ట్రాక్‌ దాటే సమయంలో ట్రైన్ డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఎలిఫెంట్ ట్రాకర్లు, అలర్ట్ సిస్టమ్స్, స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎలిఫెంట్ ట్రాకర్ సహాయంతో ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఉండగానే అప్రమత్తమైనట్లుగా రైల్వే, అటవీ అధికారులు వెల్లడించారు.