BS-6 Vehicles | నవంబర్ 1 నుంచి ఢిల్లీలో బీఎస్-6 వాహనాలకే ఎంట్రీ

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కాలుష్యం వెదజల్లే వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించనున్నది. నవంబర్ 1వ తేదీ నుంచి బీఎస్-6 కమర్షియల్ డీజిల్ వాహనాలను మాత్రమే మహానగరంలోకి అనుమతిస్తారు. బీఎస్-4 తో పాటు దిగువ స్థాయి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. మహానగరంలో కాలుష్య తీవ్రత తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

BS-6 Vehicles | నవంబర్ 1 నుంచి ఢిల్లీలో బీఎస్-6 వాహనాలకే ఎంట్రీ

హైదరాబాద్, విధాత :

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కాలుష్యం వెదజల్లే వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించనున్నది. నవంబర్ 1వ తేదీ నుంచి బీఎస్-6 కమర్షియల్ డీజిల్ వాహనాలను మాత్రమే మహానగరంలోకి అనుమతిస్తారు. బీఎస్-4 తో పాటు దిగువ స్థాయి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. మహానగరంలో కాలుష్య తీవ్రత తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

నవంబర్ 1వ తేదీ నుంచి ఢిల్లీ చుట్టూ ఉన్న అన్ని చెక్ పోస్టుల వద్ద బీఎస్-6 కమర్షియల్ వాహనాలు అనగా లారీలు, ట్రక్కులు, రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు ఇప్పటికే లేఖలు రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాహనాలను నియంత్రించే బాధ్యతను కూడా ఆ రాష్ట్రాలకు అప్పగించారు. బీఎస్-6 వాహనాల్లో భారత్ స్టేజ్-4 అత్యున్నత వాయు ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. మానవులకు హాని కలిగించే నైట్రోజన్ ఆక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను స్వల్ప మోతాదులో విడుదల చేస్తాయి. ప్రమాణాలకు మించి పొగ వెద జల్లడం మూలంగా శ్యాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. బీఎస్-4 వాహనాలతో పోల్చితే బీఎస్-6 వాహనాల్లో సల్ఫర్ మోతాదు తక్కువగా ఉంటుంది. దేశంలో 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలు ఉన్న వాహనాలను విక్రయిస్తున్నారు. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్న బీఎస్-4 డీజిల్ వాహనాలను వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అనుమతించనున్నారు.