అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల క్రమంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 770 పెరిగి రూ. 1,43,570వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ.1,31,600 వద్ద నిలిచింది. కిలో వెండి ధరలు సైతం రూ.5,000 పెరిగి రూ, 2,40,000కు చేరుకుంది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు.. హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో మార్కెట్ లో మరోసారి చమురు ధరల పెంపుదల కొనసాగుతుండగా..బంగారం హెచ్చుతగ్గుదలపై కూడా ప్రభావం పడుతుంది. ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి మూసివేత సుదీర్ఘంగా కొనసాగిన పక్షంలో అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలపైన, ద్రవ్యోల్బణ వ్యతిరేక ప్రభావానికి (డిఫ్లేషనరీ ఎఫెక్ట్) దారితీయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అటువంటి మందగమన పరిస్థితులు సుదీర్ఘ కాలంలో వాస్తవానికి బంగారానికి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
