Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్లు 10గ్రాముల బంగారం ధర రూ.300పెరిగి రూ.90,450వద్ద కొనసాగుతుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.330పెరిగి రూ.98,680కి చేరింది. బెంగుళూరు, చెన్నై, ముంబాయ్ లలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.90,600, 24క్యారెట్లకు రూ.98,330గా ఉంది.


దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.86,271, 24క్యారెట్లకు రూ.93,131, అమెరికాలో రూ.86,691, రూ.92,457వద్ధ కొనసాగుతుంది. వెండి ధరలు వరుసగా నాల్గవ రోజు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,11,000గా కొనసాగుతుంది.