పెరిగిన బంగారం..తగ్గిన వెండి ధరలు

సోమవారం బులియన్ మార్కెట్ లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ.1,46,510 కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400పెరిగి రూ.1,34,300వద్ద నిలిచింది. అయితే కిలో వెండి ధర మాత్రం రూ. 100 తగ్గి రూ. 2,54,900వద్ద కొనసాగుతంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jun 22, 2026, 10:02 am IST
Read Time: 2 mins
పెరిగిన బంగారం..తగ్గిన వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..శాంతి చర్చలలో గందరగోళం, హర్మూజ్ మళ్లీ మూసివేతతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ.1,46,510 కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400పెరిగి రూ.1,34,300వద్ద నిలిచింది. అయితే కిలో వెండి ధర మాత్రం రూ. 100 తగ్గి రూ. 2,54,900వద్ద కొనసాగుతంది.

మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం..ప్రస్తుతం బంగారం, వెండి ధరల కదలికలు ప్రధానంగా అమెరికా-ఇరాన్ చర్చలు, ముడి చమురు ధరలు, కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రభావితం కానున్నాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరగబోయే అమెరికా-ఇరాన్ దౌత్యపరమైన చర్చలపై ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ దృష్టి కేంద్రీకరించింది. అలాగే అమెరికా డాలర్ విలువ, ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు, ద్రవ్యోల్భణ పరిస్థితులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేయనున్నాయి.