Bhattivikramarka । మాది ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

ఉద్యోగుల పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్ఫథంతో ఉంద‌ని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టివిక్రమార్క తెలిపారు.

Bhattivikramarka । మాది ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Bhattivikramarka । ఉద్యోగుల పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్ఫథంతో ఉంద‌ని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టివిక్రమార్క తెలిపారు. బుధ‌వారం సచివాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ క‌మిటీ (టీజీఈజేఏసీ) స‌భ్యులు భట్టిని క‌లిసి త‌మ స‌మ‌స్యలు వివ‌రించారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల‌ను వెంటనే విడుద‌ల చేయాలని కోరారు. పే రివిజ‌న్ క‌మిష‌న్  రిపోర్టును వెంట‌నే తెప్పించుకుని, ఉద్యోగుల‌కు 51 శాతం పిట్ మెంట్ అమ‌లు చేయాలని కోరారు. ఉద్యోగుల‌కు హెల్త్ కార్డులు జారీ చేయ‌డంతో పాటు, ఉద్యోగుల‌కు సంబంధించిన ఈ కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లుల‌ను వెంట‌ను క్లియ‌ర్ చేయాలన్నారు. ఈ కుబేర్ సిస్టమ్ ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌దిలీ చేసిన ఉద్యోగుల‌ను తిరిగివారిన పాత స్టేష‌న్ కు బ‌దిలీ చేయాలన్నారు. సీపీఎస్ ను ర‌ద్దు చేసీ ఓపీఎస్ ను అమలు చేయాలన్నారు. జీఓ 317ను సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఎంప్లాయిస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను పున‌రుద్దరించాలని కోరారు.  ఇలా 39 డిమాండ్లను డిప్యూటీ సీఎం ముందుంచారు.

ఉద్యోగులతో ఎన్ని సార్లైనా చర్చిస్తామన్న డిప్యూటీ సీఎం

జేఏసీ నాయ‌కుల డిమాండ్లపై భ‌ట్టి  స్పందిస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల ప‌ట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్నారు. స‌మ‌స్యల ఆప‌రిష్కారానికి ఉద్యోగుల‌తో ప్రభుత్వం ఎన్నిసార్లు అయినా చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీజీఈజేఏసీ చైర్మన్న్ మారం జ‌గ‌దీశ్వర్‌, సెక్రెట‌రీ ఏలూరి శ్రీనివాస‌ రావు, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు ఇత‌ర ముఖ్యనాయ‌కులున్నారు.