Telangana : ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై టీజీఈజేఏసీ కృతజ్ఞతలు తెలిపి సంతోషం వ్యక్తం చేసింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఈజేఏసీ ఛైర్మన్ మారం జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలతో దశాబ్దాలుగా గుర్తింపును పొందిన ఉద్యోగ సంఘాలకు 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గుర్తింపును రద్దు చేసిందన్నారు.
మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బుధవారం తిరిగి ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వడం సంతోషకరమన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులందరికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే ఉన్నతాధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.