Health Cards | విద్యార్థులకు హెల్త్ కార్డులు.. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే!

విద్యార్థులు బాగా చదవాలని పాఠశాలకి మంచి పేరు తేవాలన్న ఆలోచన లో ఉపాధ్యాయులు, మరో పక్క..తమ పిల్లలు బాగా కష్టపడి కెరియర్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఇటు తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి. కానీ, విద్యార్థులకు ఉన్నతమైన చదువుతోపాటు మెరుగైన ఆరోగ్యం... దానిని నిరంతరం పరిరక్షించడం కుడా అవసరమే అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధ్యేయం. ఎందుకంటే ఒక విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన చదువు మీద దృష్టి పెట్టగలుగుతాడని కలెక్టర్ ఆలోచన...

Health Cards | విద్యార్థులకు హెల్త్ కార్డులు.. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే!

విధాత, జనగామ :

విద్యార్థులు బాగా చదవాలని పాఠశాలకి మంచి పేరు తేవాలన్న ఆలోచన లో ఉపాధ్యాయులు, మరో పక్క..తమ పిల్లలు బాగా కష్టపడి కెరియర్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఇటు తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి. కానీ, విద్యార్థులకు ఉన్నతమైన చదువుతోపాటు మెరుగైన ఆరోగ్యం… దానిని నిరంతరం పరిరక్షించడం కుడా అవసరమే అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధ్యేయం. ఎందుకంటే ఒక విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన చదువు మీద దృష్టి పెట్టగలుగుతాడని కలెక్టర్ ఆలోచన…

ప్రభుత్వ విద్య సంస్థలను నమ్మి తల్లిదండ్రులు తమ పిల్లలను జాయిన్ చేపించినందుకు… వారిని బాగా చూసుకోవలని కలెక్టర్ కృత నిశ్చయం…ఈ ఆశయం నుండి పుట్టుకొచ్చిందే హెల్త్ కార్డు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన ‘దిక్సూచి’ కార్యక్రమంలో భాగంగా… మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్ కి అవసరమయ్యేలా విద్యా & జ్ఞాన నైపుణ్యాలు, వ్యక్తిగత అభివృద్ధి నైపుణ్యాలు (పీడీఎస్), పౌర & నైతిక నైపుణ్యాలు (సీఈఎస్)
, సామాజిక నైపుణ్యాలు (SIS ఎస్‌ఐ‌ఎస్), కెరీర్ & వృత్తి నైపుణ్యాలు ( సీపీఎస్), శారీరక ఆరోగ్య నైపుణ్యాలు, సృజనాత్మకత & ఆవిష్కరణలు ( సీఎస్‌ఐ), సాంకేతిక & ఆధునిక నైపుణ్యాలు (టీటీఎస్) లాంటి విద్యార్థులకు అవసరమయ్యే వివిధ ప్రాధాన్యాత అంశాల్లో…ప్రతీ రోజు ఒక్కో టాపిక్ పైన అర్ద గంట సేపు ఈ దిక్సూచి పిరియడ్ లో… ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగహన కల్పిస్తున్నారు.

శారీరక ఆరోగ్య నైపుణ్యాలు అనే అంశంలో భాగంగా…జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెల్త్ కార్డును అందించారు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ హైట్, వెయిట్, BMI, Blood Grouping, Hb Percentage (ఎనీమియ), పల్స్ రేట్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డీసీజ్, స్కిన్, ENT, న్యూరోలాజికల్, Birth Defects, Congenital problems, కన్వల్షన్స్, పల్మనరీ డిసీజ్, ముఖ్యంగా 4’Ds డిఫెక్ట్స్, డిఫైసెనీసీ, డిసీజ్, డెవెలప్మెంటల్ డిలేస్ గురించి తెలుసుకొని హెల్త్ కార్డు లో నమోదు చేస్తున్నారు. Eye ఎక్సమినేషన్ లో విజన్, కలర్ బ్లైండ్నెస్, ఇతర eye రిలేషన్స్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ ఉన్నాయా అని పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాలికలకు సంబందించి..మెన్స్ట్రవల్ హిస్టరీ, ఇతర క్రోనిక్ ప్రొబ్లెమ్స్, ట్రీట్మెంట్ స్టేటస్, ఇతర ఆరోగ్య సమస్య లను తెలుసుకుంటున్నారు. హెల్త్ కార్డు ఇచ్చి పరీక్షలు చేసి, అందులో నమోదు చేయడమే కాదు…నెల నెల చెక్ అప్ లు, వేరే హాస్పిటల్ కి రిఫర్ చేయడం, ట్రీట్మెంట్ ఇచ్చేందుకు… జిల్లా వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. జిల్లాలో మొత్తం 39 రెసిడెనిషియల్ పాఠశాల లలో 14993 మంది విద్యార్థులకు ఈ దిక్సూచిలో భాగంగా హెల్త్ కార్డును అందించగా… స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు -4898 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పూర్తయింది. ఈ స్పెషల్ డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ… మెడికల్ అధికారులను విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉంది అని తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మంచి అవకాశం : భార్గవ్ సాయి, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి

హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అన్ని పరీక్షలు చేయడం వల్ల మా ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకునే మంచి అవకాశం వచ్చింది. దీని గురించి మా తల్లిదండ్రులకు చెప్పాం.. చాలా సంతోష పడ్డారు.

కలెక్టర్ సారుకి చాలా థ్యాంక్స్ : విద్యార్థుల తల్లిదండ్రులు

పాఠశాల అంటే విద్యార్థుల చదువు, పరీక్షలు ఇంతవరకె పరిమితంగా ఉండేది.. కానీ కలెక్టర్ ఆలోచనతో విద్యార్థుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని మాకు కూడా అర్థమైంది. హెల్త్ కార్డు విద్యార్థుల ఆరోగ్యానికి ఒక భరోసాల మారనుంది. విద్యార్థుల కోసం ఒక కలెక్టర్ ఆలోచించడం… ఇన్నేళ్ల మా కేరిర్ లో ఇదే మొదటిసారి. ఈ ప్రభుత్వం వచ్చాక… మా పిల్లలకు భోజనం చాలా మంచిగా పెడుతున్నారు. అయినప్పటికీ బిడ్డ ఏం తింటున్నారో…ఎలా చదువుతున్నారో.. ఎలా ఉన్నారో అనే భయం తల్లిదండ్రులు గా మాకు ఉంటోంది. కానీ ఈ హెల్త్ కార్డు వల్ల… తమ బిడ్డకు సంబంధించిన పూర్తి ఆరోగ్యం మాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. భయం అనేది పోయి ఇప్పుడు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. కలెక్టర్ సారూ కి చాలా థ్యాంక్స్.

కార్పొరేట్ స్థాయిలో…ప్రభుత్వ పాఠశాలలో… నేటి ఆధునికతకు అనుగుణంగా.. ఉన్నతమైన విద్య…. మంచి పోషకాలు గల ఆహరాన్ని ప్రభుత్వం సమకూరుస్తుండడంతో… నో అడ్మిషన్స్ అనే బోర్డు లు పెట్టిన ప్రభుత్వ పాఠశాల లు లేకపోలేదు. చదువే కాదు.. మీ బిడ్డ ఆరోగ్యం కుడా మాదే బాధ్యత అని హెల్త్ కార్డును అందించిన…కలెక్టర్ సరికొత్త ఆలోచనతో…మున్ముందు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఎంత పోటీ ఉంటుందో ఇక చూడాలి.