Honda WN7 | హోండా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. WN7 మోడల్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలు.. మార్కెట్‌లోకి ఎప్పుడొస్తుందో!

Honda WN7 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా త్వరలోనే తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు హోండా WN7 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలు చేసింది.

Honda WN7 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా త్వరలోనే తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు హోండా WN7 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలు చేసింది. దీంతో ఈ బైక్ త్వరలోనే భారత మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చర్చ మొదలైంది.

హోండా WN7 డిజైన్ చాలా డిఫరెంట్‌గా, మోడ్రన్‌గా ఉంది. ఈ కాన్సెప్ట్ మోడల్‌ను హోండా గత ఏడాది జరిగిన EICMA 2025 ఆటో షోలో ప్రదర్శించింది. భవిష్యత్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ల దిశగా కంపెనీ ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ మోడల్‌ను రూపొందించింది. ఇది షార్ప్ బాడీ ప్యానెల్స్, అగ్రెసివ్ లుక్స్‌తో ఉంది. ఫ్రంట్‌లో రోబొటిక్ లుక్ కోసం నిలువు LED లైటింగ్ సిస్టమ్, సిగ్నేచర్ వైడ్ DRLను ఇచ్చారు.

ఈ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది సుమారు 50kW శక్తిని ఉత్పత్తి చేయగలదు. అంటే 67.57bhp పవర్‌కు సమానం. ఈ హోండా WN7లో 9.3kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా కలదు. CCS2 ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేయడం వల్ల కేవలం 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 20 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బైక్ గరిష్టంగా 130kmph వేగంతో వెళ్లగలదని తెలుస్తోంది.

ఫీచర్లపరంగా కూడా ఈ బైక్ అత్యాధునిక సాంకేతికతతో రానుంది. IMU ఆధారిత కార్నరింగ్ ABS, స్టాండర్డ్, స్పోర్ట్, రైన్, ఎకానమీ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, 5 అంగుళాల TFT డిస్‌ప్లే, స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫార్వర్డ్ రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే 43mm షోవా USD ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABSతో కూడిన డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. ఇవి బైక్‌కు మెరుగైన హ్యాండింగ్, స్థిరత్వాన్ని అందించనున్నాయి. అయితే, ప్రస్తుతానికి హోండా కంపెనీ WN7 బైక్‌‌కు పేటెంట్ మాత్రమే ఫైల్ చేసింది. కమర్షియల్ లాంచ్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read More:

Honda | భారత్‌లో హోండా CB300F మోడల్‌ గుడ్‌బై.. అమ్మకాలు బంద్.. సైలెంట్‌గా వెబ్‌సైట్ నుంచి తొలగింపు!

రూ.10లక్షల్లోనే పనోరమిక్ సన్‌రూఫ్.. టాటా నెక్సన్ కొత్త వేరియంట్ లాంచ్!

 

Latest News