Shamshabad Land Encroachment| ఆక్రమణ నుంచి రూ.300కోట్ల భూముల స్వాధీనం!

Hyderabad land scam: హైదరాబాద్(Hyderabad)లో భూముల విలువ రోజురోజుకు పెరిగి ఇటీవల ఎకరం భూమి రూ.100కోట్లకు ఎగబాగిన నేపథ్యంలో భూముల కబ్జాలు( Lands Encroachment)..వివాదాలు సైతం పెరిగిపోతున్నాయి. అధికారం..ఆర్థిక బలం..అంగబలం ఉన్న వ్యాపారులు సామాన్యుల భూములను..ప్రభుత్వ భూముల( Government lands)పైన..వివాదంలో ఉన్న భూములపైన కన్నేసి కొట్టేయడం వంటి అక్రమాలు పెరిగి కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ(Real estate encroachment) తన గోల్ మాల్ మాయాజాలంతో ఏకంగా రూ.330కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా ఆక్రమించేసి సొమ్ము చేసుకోవాలనుకున్న ప్లాన్ ను హెచ్ఎండీఏ(HMDA), రెవెన్యూ అధికారులు(Revenue Officials) భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్ విమానశ్రయం(Shamshabad land recovery) సమీపంలో మంఖాల్(Mankhal lands)రెవెన్యూ పరిధిలో రూ.300 కోట్లు విలువైన 24.12 ఎకరాల సీలింగ్ (ఎసైన్డ్) భూములను కబ్జాదారుల ఆక్రమణ నుంచి రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖలు సంయుక్తంగా మంఖాల్‌లోని సర్వే నంబర్లు 68, 70, 71, 73, 85, 86ల్లో సర్వే చేసి 24.12 ఎకరాలకు హద్దులు నిర్ణయించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ వాటి పరిరక్షణకు కంచె నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఈ సీలింగ్ భూములను పక్కనే ఉన్న వర్టెక్స్ కేఎల్లార్ డెవలపర్స్ సంస్థ తమ వెంచర్‌లో కలిపేసుకుంది. ఈ వ్యవహారంపై హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం విచారణ చేసింది. రియల్ ఎస్టేట్ ఆక్రమణ నుంచి విలువైన ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ భూమిని ప్రభుత్వం తుక్కుగూడలో భూమి లేని పేదలకు పంపిణీ చేసింది. సదరు భూమిని రైతులు ఓ రియల్ వ్యాపారికి విక్రయించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పీఓటీ నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి చుట్టూ పోలీసుల సహకారంతో రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఏడీ శ్రీనివాస్, డీఐ కృష్ణయ్య లతో పాటు హెచ్‌ఎండీఏ ఎస్టేట్ అధికారి సుదర్శన్, ఎస్‌ఈ అప్పారావులు పాల్గొన్నారు.