IRCTC Ooty Tour | హైదరాబాద్ నుంచి ఊటీ ట్రిప్.. రూ.13 వేలలోనే టూర్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ!

IRCTC Kerala Tour | ఈ వేసవిలో ఊటీ అందాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.13 వేలలోనే ఊటీ ట్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. ప్రతి మంగవారం హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ప్రారంభం కానుంది.

irctc-ooty-tour-summer package details

IRCTC Ooty Tour | ప్రకృతి అందాలు, చల్లటి వాతావరణాన్ని ఇష్టపడే వారికోసం ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం తీసుకొచ్చింది. ఊటీ, కూనూర్ వంటి ప్రముఖ హిల్ స్టేషన్ల సందర్శన కోసం Ultimate Ooty Ex-Hyderabad పేరిట స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు జరిగే ఈ ట్రిప్ ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది.

రైలు, రోడ్డు మార్గంలో జరిగే ఈ ఊటీ ట్రిప్‌లో పచ్చని తోటలు, టీ ఎస్టేట్స్, జలపాతలు, పచ్చటి కొండలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ వేసవి కాలంలో కూల్ ట్రిప్ కోసం ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని ట్రావెలర్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే టూర్ కోసం ఐఆర్‌సీటీసీ కంఫర్ట్ (3టైర్ ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) విభాగాలుగా చార్జ్ చేస్తున్నారు.

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్‌లో విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.30,060 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.17,130; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.16,120 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.8,840; బెడ్ లేకుండా అయితే రూ.6,490 చార్జ్ చేస్తుంది.

స్టాండర్డ్ విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.26,190 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.13,920; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.13,010 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.6,300 బెడ్ లేకుండా అయితే రూ.3,950 చార్జ్ చేస్తుంది. ఈ చార్జిలు మార్చి 24వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తాయి.

అదే మార్చి 31వ తేదీ నుంచి జూన్ 23 వ తేదీ వరకు పెరిగిన చార్జీలు అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. కంఫర్ట్‌లో విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.33,590 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.18,890; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.17,170 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.8,840; బెడ్ లేకుండా అయితే రూ.6,490 చార్జ్ చేస్తుంది.

స్టాండర్డ్ విభాగంలో అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.31,050 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.16,360; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.14,630 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.6,300 బెడ్ లేకుండా అయితే రూ.3,950 చార్జ్ చేస్తుంది.

టూర్ వివరాలు

ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ తర్వాత నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్ ఉంది. జర్నీ అనంతరం మళ్లీ అదే స్టాప్‌ల్లో దిగొచ్చు.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్:20629) మధ్యాహ్నం 2.25 గంటలకు ప్రారంభమవుతుంది. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.

రెండో రోజు: ఉదయం 9.10 గంటలకు కోయంబత్తూర్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ఊటీకి రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్‌ ఇన్ అయి రీఫ్రెష్ అవుతారు. అనంతరం బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

మూడో రోజు: ఊటీలోని హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సైట్ సీయింగ్ కోసం కూనూర్ వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేసి కోయంబత్తూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌(ట్రైన్ నంబర్: 20630)లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఆరో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* రైలు టికెట్లు
* బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి మూడు రోజులకు హోటల్ వసతి
* లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఏసీ వాహన సదుపాయం
* సైట్ సీయింగ్
* టోల్, పన్నులు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం
* ట్రైన్‌లో భోజనం
* ఎంట్రీ టికెట్లు
* బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్
* టూర్ గైడ్
* వ్యక్తిగత ఖర్చులు

ముఖ్య నిబంధనలు

* ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్లు ఇస్తారు
* హోటల్‌లో చెక్ ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలకు
* ట్రైన్ ఆలస్యంగా వస్తే షెడ్యూల్ మరుతుంది.

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ

IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Latest News