Site icon vidhaatha

Train: ర‌న్నింగ్ ట్రైన్‌లో.. భార్య ఎదుటే ఆ ప‌నులు ! దేహ‌శుద్ధి చేసిన ప్ర‌యాణికుడు

విధాత, వెబ్ డెస్క్ : బస్సులలో, రైళ్లలో మెట్రో రైళ్లలో..రద్ధీ ప్రాంతాల్లో.. నిర్మానుష్య ప్రాంతాల్లో మహిళలు కనిపిస్తే చాలు కొందరు అదే పనిగా వేధింపులకు దిగుతుంటారు. వారిని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచికానందం పొందుతుంటారు. ఎక్కువగా ఇలాంటివి రద్దీగా ఉండే చోట సాగుతుంటాయి. అందుకు భిన్నంగా నడుస్తున్న రైలు(Moving Train)లో నిద్రిస్తున్న(Sleeping) ఓ యువకుడి(Young Man)పై ఓ వ్యక్తి(A Man) హోమో సెక్సువల్ చర్యల(homosexual acts)కు పాల్పడి దేహశుద్ధి(Beaten)కి గురయ్యాడు. పూణే-హతియా ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన వైరల్ గా మారింది.

నిర్మల్ మిశ్రా అనే యువకుడు పూణే-హతియా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో వెళ్తున్నాడు. తనకు కేటాయించిన బెర్త్ లో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో కింది బెర్తులో ఛత్తీస్‌ఘడ్ కు చెందిన ఓ వ్యక్తి పడుకున్నాడు. భార్య కూడా అతడి పక్కనే నిద్రిస్తుంది. అయితే ఆ వ్యక్తి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో లేచి పైన బెర్త్ లో నిద్రిస్తున్న నిర్మల్ మిశ్రా బాడీని తాకాడు. అక్కడితో ఆగకుండా ప్రైవేటు భాగాన్ని టచ్ చేసి అతడికి ముద్దు పెట్టాడు. ఆ వ్యక్తి చర్యలతో ఉలిక్కి పడిన నిర్మల్ మిశ్రాకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది.

ఏం జరిగిందో అర్ధం చేసుకుని ఆ వ్యక్తిని నిలదీసి అతనిపై తిట్లకు లంఘించుకున్నాడు. తన భార్య పక్కన ఉంటుండగానే ఇలా చేయడంతో రైలులోని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి భార్య జోక్యం చేసుకుని ఏదో అయిపోయిందండి.. వదిలేయండి బాబు అంటూ వేడుకుంది. కానీ ఆ పాడు పని చేసిన వ్యక్తి మాత్రం.. నాకు నిన్ను కిస్ చేయాలనిపించిందని.. అందుకే చేశానని తాపీగా సమాధానమిచ్చాడు. దీంతో నిర్మల మిశ్రా మరింత ఆగ్రహానికి గురై ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

Exit mobile version