Shivangi singh | భారతదేశపు ఏకైక మహిళా ‘రఫెల్’ పైలెట్.. ఎవరీ శివాంగి సింగ్?

శివాంగి సింగ్.. అత్యంత కఠినమైన యుద్ధవిమానాల్లో ఒకటిగా ఉన్న మిగ్ 21 బైసన్ యుద్ధవిమానానికి పైలెట్ గా వ్యవహరించారు. తరువాత శివాంగి రఫెల్ స్క్వాడ్రన్‌లో చేరింది. దీంతో దేశంలో రఫెల్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఆమె చరిత్ర సృష్టించారు.

Shivangi singh | భారతదేశపు ఏకైక మహిళా ‘రఫెల్’ పైలెట్.. ఎవరీ శివాంగి సింగ్?

బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సందర్శించిన సందర్భంగా రాష్ట్రపతి రఫెల్ విహరించిన అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనుక ఉన్న మహిళ గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమెను బంధించినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది.. అసలు ఇంతకూ ఎవరా ‘రఫెల్’ రాణి? ఆమె గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ రఫెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం మన దేశం దాయాది దేశం మెడలు కూడా వంచింది. ఈ సయంలో పాక్ మన దేశం గురించి అసత్య ప్రచారాలు చేసింది. యుద్ధ విమానాలు కూల్చేశామని, ఇందులో ఓ మహిళా పైలెట్ ను బంధించినట్టు ప్రకటించింది. దీనికి ధీటుగా భారత్ స్పందిస్తూ అవన్నీ అసత్య ప్రచారేనంటూ తిప్పికొట్టింది. ఆ సమయంలోనే రఫెల్ పైలెట్ శివాంగి సింగ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు.

కానీ, బుధవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఫోటో దిగడంతో ఆమె పేరు మరోసారి వైరల్ అయింది. 1995లో మార్చి 15న బీహార్ లో జన్మించిన శివాంగి సింగ్ సాధారణ కుటుంబంలో పెరిగారు. సిక్కిం మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి, అనంతరం మలవీయ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జైపూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కాగా, 2020లో రఫెల్ ఫ్లీట్ లో చేరే ముందు శివాంగి సింగ్.. అత్యంత కఠినమైన యుద్ధవిమానాల్లో ఒకటిగా ఉన్న మిగ్ 21 బైసన్ యుద్ధవిమానానికి పైలెట్ గా వ్యవహరించారు. తరువాత శివాంగి రఫెల్ స్క్వాడ్రన్‌లో చేరింది. దీంతో దేశంలో రఫెల్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఆమె చరిత్ర సృష్టించారు.