Jubilee Hills By Election| జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100 దాటిన నామినేషన్లు..నేడే ఆఖరు రోజు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నేడు మధ్యహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియ్యనుంది

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByElection)కు సంబంధించి ఇప్పటికే 100కు పైగా నామినేషన్లు(Nominations) దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నేడు మధ్యహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియ్యనుంది. చివరి రోజు నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రైతులు, నిరుద్యోగులు పలువురు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నేడు భారీ ర్యాలీ తో నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డిలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ నెల 22న నానమినేషన్ల పరిశీలన, తిరస్కరణ, 24న ఉపసంహరణ, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అభ్యర్థులు, వారి పార్టీల శ్రేణులు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయా పార్టీల ప్రధాన నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు సైతం ప్రచార బరిలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది.