Naveen Yadav : జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ కు 19,619ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం… 7వ రౌండ్ ముగిసే సరికి 19,619 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు ప్రారంభం.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మెజార్టీ పెరుగుతుంది. ఏడవ రౌండ్ ముగిసే సరికి నవీన్ యాదవ్ కు 19,619ఓట్ల మెజార్టీ లభించింది. నవీన్ యాదవ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితపై ఇప్పటిదాక 19,619ఓట్ల మెజార్టీ దక్కింది. బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాల హడావుడి ప్రారంభించాయి. గాంధీభవన్ కు కాంగ్రెస్ శ్రేణులు, నాయకుల హడావుడి మొదలైంది. అటు నవీన్ యాదవ్ ఇంటి వద్ధ సంబరాలు మొదలయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram