Kavitha Hunger Strike| బీసీ రిజర్వేషన్ల సాధనకు 72 గంటల నిరాహార దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత

విధాత, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల(BC Reservations) సాధనకు 72గంటల పాటు నిరాహార దీక్ష(72Hours Deeksha) చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ప్రకటించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4, 5, 6వ తేదీల్లో హైదారాబాద్ లో 72గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రకటించారు.
గతంలో తాను అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం చేసిన మాదిరిగానే మరోసారి 72గంటల నిరాహార దీక్ష చేస్తానన్నారు బీసీ బిల్లు అవసరంపై గాంధేయవాద పద్దతిలో నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించే నిరసన దీక్ష కార్యక్రమం అంతా కన్ఫ్యూజన్ దీక్ష అని కవిత విమర్శించారు. నా దీక్ష నిర్వహణకు ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని..అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడే దీక్ష చేసి నా నిబద్ధతను ప్రపంచానికి చాటుతానన్నారు.