Khushbu Sundar| విజయ్ సభలో తొక్కిసలాట వెనుక కుట్ర : కుష్బు సంచలన వ్యాఖ్యలు
కరూర్ తొక్కిసలాట ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కుష్బు తాజాగా కామెంట్స్ చేశారు. ఇప్పటికే కరూర్ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ టీవీకే ఆరోపిస్తుండగా..ఇప్పుడు బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడంతో రాజకీయంగా ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.
విధాత : తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో టీవీకే(TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay Karur rally) కరూర్ ప్రచార సభ తొక్కిసలాట ఘటన రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇప్పటికే కరూర్ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ టీవీకే ఆరోపిస్తుండగా..ఇప్పుడు బీజేపీ(BJP) నాయకురాలు కుష్బు సుందర్ (Khushbu Sundar)సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడంతో రాజకీయంగా ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కుష్బు తాజాగా కామెంట్స్ చేశారు. కుష్బు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోందన్నారు. ఎందుకంటే విజయ్ ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోగా.. ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలిసి కూడా సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సీఎం స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారని..పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలని.. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.
విజయ్ కు మద్దతుగా బీజేపీ ?
కరూర్ ఘటనలో బీజేపీ నేతలు వరుసగా అధికార డీఎంకే పార్టీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. అధికార డీఎంకే విజయ్ ని లక్ష్యంగా చేసుకుంటే ఆయనకు బీజేపీ అండగా నిలబడాలని బీజేపీ కొత్త రాజకీయ వ్యూహం రచించినట్లుగా చర్చలు సాగుతున్నాయి. భవిష్యత్తులో టీవీకేతో రాజకీయ పొత్తుకు బాటలు వేసుకోవాలన్న వ్యూహంతోనే బీజేపీ విజయ్ కు మద్దతుగా మాట్లాడుతుందన్న వాదన వినిపిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram