PDSU | విద్యార్థి అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం : పీడీఎస్‌యూ నేత నర్సింహారావు

విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, శాస్త్రీయ విద్య సాధన, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుతూ అమరులైన విప్లవ విద్యార్థి వీరుల ఆశయాలను కొనసాగిద్దామని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్చారు.

PDSU | విద్యార్థి అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం :  పీడీఎస్‌యూ నేత నర్సింహారావు

విధాత, వరంగల్ ప్రతినిధి:

విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, శాస్త్రీయ విద్య సాధన, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుతూ అమరులైన విప్లవ విద్యార్థి వీరుల ఆశయాలను కొనసాగిద్దామని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు విప్లవ విద్యార్థి అమరవీరుల వారోత్సవాలను ( నవంబర్ 5 నుండి 11 వరకు) పురస్కరించుకొని విద్యార్థి అమరవీరుల చిత్రపటాలకు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బి.నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను విద్యార్థి లోకం ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు. దేశంలో పేద వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా కాషాయకరణను విద్యార్థులంతా ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు పి. అనూష, శ్రీజ, లోకేష్, సహాయ కార్యదర్శులు సాధన, చందన, శ్రీకాంత్, నాయకులు గణేష్, బాలు, చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.