PDSU| సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పీడీఎస్ యూ

PDSU| సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పీడీఎస్ యూ

విధాత, హైదరాబాద్ : పెండింగ్ ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పీడీఎస్ యూ విద్యార్థి సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పీడీఎస్ యూ విద్యార్థులు సీఎం ఇంటి ముట్టడి కోసం గుంపులుగా పరుగెత్తుతూ సీఎం ఇంటివైపు దూసుకెళ్లారు. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని నిలువరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది.

పెండింగ్‌ స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలువిడుదల చేయాలని నినాదాలు చేశారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజినీరింగ్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.