Tragic Incident| పర్యాటక కొండపై కారుతో విన్యాసాలు..300 అడుగుల లోయలోకి!

విధాత, హైదరాబాద్ : పర్యాటక ప్రదేశంలో కొండపై కారుతో విన్యాసాలు వికటించి విషాదకరమైన ఘటన వైరల్ గా మారింది. కరాడ్‌లోని గోలేశ్వర్‌కు చెందిన స్నేహితులతో సాహిల్ జాదవ్ కారులో మహారాష్ట్ర పఠాన్-సదావాఘాపుర్ మార్గంలోపర్యాటక కొండపైకి వెళ్లాడు. ప్రకృతి అందాలు వీక్షించి పరవశించాల్సిన ప్రాంతంలో వీడియో కోసమని కారుతో గింగిరాలు తిరుగుతూ విన్యాసాలతో అతి చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన కారు కొండపై నుంచి దిగువకు కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సాహిల్ జాదవ్ కు తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించాయి. సోషల్ మీడియాలో వైరల్ కోసం సాహిల్ జాదవ్ చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది.
గుజర్వాడి ప్రాంతంలోని పఠాన్ నుంచి 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక ప్రాంతం నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంది. కొండలు..పెద్ద లోయ ఉండే ఈ ప్రాంతంలో పర్యాటకుల భద్రతకు అవసరమైన సదుపాయాలు లేకపోగా..కనీసం సూచికలు కూడా కానరావు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. కొండపై ఇలాంటి సాహసాలు చేయరాదని హెచ్చరించారు.
పర్యాటక కొండపై ప్రమాదం.. కారు 300 అడుగుల లోయలోకి!
మహారాష్ట్ర పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో స్నేహితులతో కారులో కొండపైకి వెళ్లిన సాహిల్ జాదవ్.
విన్యాసాల సమయంలో అదుపు తప్పిన కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. pic.twitter.com/FwyKDFGgNQ
— greatandhra (@greatandhranews) July 11, 2025