MaheshBabu-Rajmouli| సింహాలతో మహేష్ బాబు..వైరల్ గా రాజమౌళి సినిమా క్లిప్

విధాత : ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ (SSMB29 Shooting)స్పాట్ నుంచి లీకైనట్లుగా భావిస్తున్న ఓ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral Clip)గా మారింది. ఫారెస్టు బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల కెన్యా దేశం అభయారణాల్యో, కొండలు, పచ్చిక బైళ్లలో కొనసాగింది. అక్కడ జరిగిన షూటింగ్ నుంచి లీక్ అయింది. ఈ వీడియో క్లిప్ లో మహేష్ బాబు సింహల పార్కులో సింహలతో కలిసి తిరిగిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
పెంపుడు కుక్కల మాదిరిగా హీరో మహేష్ బాబు వెంట సింహాలు వెలుతున్న సీన్ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. వీడియోలో సింహాలతో మహేష్ బాబు ఆట..వేట చూసిన అభిమానులు రాజమౌళి టేకింగ్ పై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా 120దేశాలలో విడుదల కాబోతున్న సమాచారంతో పాన్ వరల్డ్ స్థాయితో ఈ సినిమాపై భారీ అంచానలు నెలకొన్నాయి.
#MaheshBabu #SSRajamouli #SSMB29 pic.twitter.com/pTyrJEGIGg
— Mr Palanhaar (@PowerfulReviews) September 6, 2025