Mahesh Babu| రాజ‌మౌళి సినిమా కోసం అందులో ప్ర‌త్యేక ట్రైనింగ్ తీసుకుంటున్న మ‌హేష్ బాబు

Mahesh Babu| సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. ఆయ‌న చివ‌రిగా న‌టించిన గుంటూరు కారం చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించింది. అయితే బుల్లితెరపై మాత్రం అదరగొట్టింది. ఇటీవలే శాటిలైట్ ఛా

  • Publish Date - April 19, 2024 / 10:33 AM IST

Mahesh Babu| సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. ఆయ‌న చివ‌రిగా న‌టించిన గుంటూరు కారం చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించింది. అయితే బుల్లితెరపై మాత్రం అదరగొట్టింది. ఇటీవలే శాటిలైట్ ఛానల్ లో జరిగిన ప్రీమియర్ కు ఏకంగా 9.23 టిఆర్పి సాధించడం చూసి టీవీ వర్గాలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ఇక మ‌హేష్ బాబు ఇప్పుడు రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మ‌హేష్ బాబు చాలానే హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

ఈ మ‌ధ్య విదేశాల‌కి వెళ్లిన మ‌హేష్ బాబు అక్క‌డ ఫిట్‌నెస్ విష‌యంలో ట్రైన్ అవుతున్నాడ‌ట‌. అంతేకాకుండా లువురు నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకముగా స్కేటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తన పాత్ర కోసం పూర్తిగా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ బాబు త‌న కూతురితో కలిసి విదేశాల‌లో దిగిన పిక్ ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇందులో ఫుల్ హెయిర్‌తో డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించాడు. ఎప్పుడు క‌నిపించని విధంగా మ‌హేష్ బాబు ఈ సినిమాలో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ఒక కాన్సెప్ట్ వీడియో ద్వారా త్వ‌ర‌లో అనౌన్స్ చేయ‌బోతున్నార‌నే టాక్ కూడా న‌డుస్తుంది.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి పెద్ద పెద్ద కాస్టింగ్‌తోపాటు టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కమల్‌ కన్నన్ చేస్తున్నారు. ఇందులో ఇండోనేషియన్‌ నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అంటున్నారు. మరోవైపు నాగార్జున కీలక పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌హేష్ బాబు చిత్రంలో డ్యూయ‌ల్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌ని ఇందులో గెస్ట్‌గా న‌టింప‌జేసే అవ‌కాశం ఉంది. మూవీకి రెండు టైటిల్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. `మహారాజా`, `చక్రవర్తి` అనే పేర్లు పెట్టిన‌ట్టు స‌మాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Latest News