Air Pollution | గాలి కాలుష్యంతో ఎన్ని నష్టాలో తెలుసా?

గాలిలో కాలుష్యం పెరిగిపోయిందని మనం తరచుగా వింటుంటాం. అసలు గాలి కాలుష్యం అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి నష్టం ఉంది? ఈ కాలుష్యం ఎందుకు ఏర్పడుతుంది? దీని వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ఈ కాలుష్యాన్ని ఎలా అరికట్టవచ్చో తెలుసుకుందాం.

Air Pollution | గాలి కాలుష్యంతో ఎన్ని నష్టాలో తెలుసా?

గాలిలో కాలుష్యం పెరిగిపోయిందని మనం తరచుగా వింటుంటాం. అసలు గాలి కాలుష్యం అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి నష్టం ఉంది? ఈ కాలుష్యం ఎందుకు ఏర్పడుతుంది? దీని వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ఈ కాలుష్యాన్ని ఎలా అరికట్టవచ్చో తెలుసుకుందాం.

గాలి కాలుష్యం అంటే ఏంటి?

వాతావరణంలో మోతాదుకు మించి హానికరమైన పద్దార్ధాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. అంటే అధిక మోతాదులో ఘన,ద్రవ, వాయు పదార్ధాలు కలిసి గాలిని హానికరంగా మార్చడాన్ని గాలి కాలుష్యం అని అంటారు. అంటే ఈ గాలిని పీల్చితే మనుషులకు, జంతువులకు, మొక్కలకు, పర్యావరణానికి హానికలిగించే స్థితికి చేరుకుంటుంది. ఈ గాలిని పీల్చితే తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

వాయువు ఎలా కలుషితం అవుతుంది?

గాలి కలుషితం కావడానికి అనేక కారణాలున్నాయి. కిరోసిన్, పెట్రోల్, డీజీల్ మండించడంతో గాలి కలుషితం అవుతుంది. పరిశ్రమల నుంచి వెదజల్లే విషవాయువులు, వంట చెరుకును మండించడంతో కూడా గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి కూడా గాలిలో విషవాయువులకు కారణం అవుతాయి. వీటి వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, సల్పర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు విడుదల అవుతాయి. ఈ వాయువులు మనుషులతో పాటు జంతువుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. గాలిలో మనుషుల వెంట్రుకల కంటే అతి సన్నగా ఉండే ధూళి కణాలు తీవ్రమైన జబ్బులకు కారణంగా మారుతాయి. గాలిలో తేలియాడే ఘణకణాల, నీటి బిందువుల మిశ్రమంగా ధూళి కణాలు ఏర్పడుతాయి. ఇవి పీఎం 2.5 మెక్రోమీటర్ల కంటే తక్కువగా కూడా ఉంటాయి. ఇంత తక్కువగా ఉండే ధూళికణాలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి.

గాలి కాలుష్యంతో మనుషులకు వచ్చే జబ్బులు ఏంటి?

కలుషితమైన గాలిని పీల్చితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 500 ఉంటే ఎక్కువ ఉన్నట్టు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం గాలి నాణ్యత నుంచి 0 నుంచి 50 మధ్య ఉంటే నాణ్యమైన గాలిగా పిలుస్తారు. గాలిలో నాణ్యత తక్కువ అవుతున్నకొద్దీ మనుషులకు జబ్బులు పెరిగే అవకాశం ఉంది. కలుషితమైన గాలితో ఊపిరితిత్తులపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. చిన్న పిల్లలు, వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత రోగాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తాయి. గర్భిణీ స్త్రీలకు వాయు కాలుష్యంతో పుట్టబోయే పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. అంతేకాదు అబార్షన్లు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల పనితీరు మందగించడానికి సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ వంటివి కారణమని వైద్యులు చెబుతున్నారు. గాలి కాలుష్యంతో ప్రతి ఏటా సుమారు 65 నుంచి 70 లక్షల మంది అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

గాలి కాలుష్యాన్ని ఎలా నివారించాలి?

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలి. ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా మెట్రో నగరాలతో పాటు కాలుష్యాన్ని బాగా తగ్గించవచ్చు. తమ వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైళ్లు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణం చేయడం ద్వారా కొంత మేరకు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. గాజు, కాగితం, ప్లాస్టిక్ వంటివాటిని రీసైకిల్ చేయడం ద్వారా ముడిపదార్ధాల వెలికితీత, తయారీకి ఖర్చు ఆదా అవుతుంది. దీంతో భారీ పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పంటలకు మంచిది. భూమికి కూడా ఉపయోగం. రసాయన ఎరువుల వాడకం వల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వారానికి రెండు రోజులు లేదా వర్క్ ఫ్రమ్ హోం చేస్తే ఇంధన ఆధారిత ఉద్గారాలు తగ్గుతాయి. గాలిలో నాణ్యత పెరుగుతుంది.స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కూడా కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.