MLC Kavitha| అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha| అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) శనివారం ఉదయం అమెరికా(USA) బయలుదేరి వెళ్లారు. కవిత తన చిన్న కుమారుడు ఆర్యను డిగ్రీ కాలేజీ(Arya Education)లో చేర్పించేందుకు అమెరికా వెళ్లారు. కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో భర్త అనిల్, కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు. కవిత 15రోజుల పాటు అమెరికాలోనే ఉండి తిరిగి సెప్టెంబర 1న హైదరాబాద్ చేరుకుంటారు.

కవిత అమెరికా వెళ్లే ముందు కుమారుడు ఆర్యకు తాతా ఆశీస్సుల కోసమంటూ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీపైన, కేటీఆర్ పైన విమర్శలు గుప్పించిన కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.