Woman Elopes With Lover| కన్న కొడుకును బస్టాండ్ లో వదిలేసి ప్రియుడితో వెళ్లిన తల్లి

Mother Abandons Child|   భర్త(Hus band)ను కాదనుకుని..15 నెలల కొడుకు(Child)ను బస్టాండ్ లో వదిలేసి ఇన్ స్టా గ్రామ్ లో(Instagram ) పరిఛయమైన ప్రియుడి(Lover) కోసం వెళ్లిపోయిన(Eelopes) ఓ మహిళ(Women) నిర్వాకం నల్లగొండ(Nalgonda)లో వెలుగు చూసింది. హైద్రాబాద్ కు చెందిన “నవీన” అనే మహిళకు నల్లగొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. అయితే ఆ మహిళకు పెళ్లి అయ్యి.. 15 నెలల బాబు “ధనుష్” ఉన్నాడు. అయితే […]

Mother Abandons Child|   భర్త(Hus band)ను కాదనుకుని..15 నెలల కొడుకు(Child)ను బస్టాండ్ లో వదిలేసి ఇన్ స్టా గ్రామ్ లో(Instagram ) పరిఛయమైన ప్రియుడి(Lover) కోసం వెళ్లిపోయిన(Eelopes) ఓ మహిళ(Women) నిర్వాకం నల్లగొండ(Nalgonda)లో వెలుగు చూసింది. హైద్రాబాద్ కు చెందిన “నవీన” అనే మహిళకు నల్లగొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. అయితే ఆ మహిళకు పెళ్లి అయ్యి.. 15 నెలల బాబు “ధనుష్” ఉన్నాడు. అయితే ప్రియుడి మాయమాటలను నమ్మిన మహిళ భర్తను, 15 నెలల పిల్లాడిని వదిలేసి అతడితో వెళ్లేందుకు ప్లాన్ వేసింది. హైదరాబాద్ నుంచి నేరుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కు చిన్నారి కొడుకుతో పాటు వచ్చింది. ఆ బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది.

ఆ తర్వాత.. ఆ బాలుడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది.. నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్ఐ సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపించారు. పోలీసులు.. బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు “మమ్మీ” అంటూ గుర్తించాడు.

ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలింది. దర్యాప్తు కొనసాగించిన పోలీసులు మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని గుర్తించి స్టేషన్ కు తరలించి విచారించారు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం భర్తను, పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేసిందని విచారణలో పోలీసులు గుర్తించారు. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి.. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. బాలుడిని అతడికి అప్పగించారు. ఈ కేసులో ఎస్ఐ సైదులు గౌడ్, పోలీసు సిబ్బంది చేసిన కృషి స్థానికుల అభినందనలు అందుకుంది.