Jagadish Reddy | ఉత్తమ్, వెంకట్‌రెడ్డి అసమర్ధ మంత్రులు..  : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి అభివృద్ధి లేదు కానీ వందలాది కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని..బీఆర్ఎస్ కార్యక్తర్తలపై అనేక అక్రమ కేసులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పాలన‌లో వ్యవసాయరంగం దివాళా కు వచ్చిందని..మళ్ళీ బోర్లు వేయాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు.

  • By: TAAZ    news    Jul 03, 2025 7:23 PM IST
Jagadish Reddy | ఉత్తమ్, వెంకట్‌రెడ్డి అసమర్ధ మంత్రులు..  : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు

Jagadish Reddy | నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల పదవులు రానున్న రోజుల్లో ఉంటాయో ఊడుతాయోనని..ఇప్పటికే ఉన్న ఇన్‌చార్జ్ మంత్రి హోదాలు పీకేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా చండూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో జిల్లా మంత్రులు చేసిన కొత్త పనులు లేవని..బీఆర్‌ఎస్ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారన్నారు. అసమర్ధ మంత్రులుగా వారు మిగిలిపోనున్నారన్నారు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ కొత్తగా తెచ్చి వేసిన రోడ్డు లేదని..చెత్త మాటలు తప్ప చేసింది ఏమి లేదని విమర్శించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి 15, 20రోజులు అడ్రస్ లేకుండా గాయబ్ అవుతున్నాడన్నారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి పారుదల, సివిల్ సప్లై శాఖ లపై అవగాహన లేదని.. కృష్ణా నది‌తో పాటు గోదావరి జలాలను సైతం ఆంధ్రకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కేసీఆర్‌ను తిట్టడంలోనే పోటి పడుతున్నారు తప్ప..వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులే మాట్లాడి ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వలేదని..దీంతో ఇదేం సమీక్షా అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో అవినీతి..అక్రమ కేసులు

కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి అభివృద్ధి లేదు కానీ వందలాది కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని..బీఆర్ఎస్ కార్యక్తర్తలపై అనేక అక్రమ కేసులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పాలన‌లో వ్యవసాయరంగం దివాళా కు వచ్చిందని..మళ్ళీ బోర్లు వేయాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ ఎరువులు, విత్తనాల కొరత మొదలైందన్నారు. వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదని..ఇంకా 17 వేల కోట్లు ప్రభుత్వం బాకీ పడిందని, సన్నవడ్ల బోనస్ బోగస్ అయ్యిందని..రుణమాఫీ అంతే అయిందని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని..బీఆర్‌ఎస్ ఇచ్చిన వాటికే నియామకాలు ఇచ్చారని..ఉద్యోగస్తుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కమీషన్స్ కోసం బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని విమర్శించారు.

స్థానిక ఎన్నికల కోసం అక్రమ కేసులు

చండూర్ మున్సిపల్ చైర్మన్ ఇల్లు చిన్న కారణంతో కూల్చి వేశారని..ఇలా కేసులు పెట్టి భయపెట్టి స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పోలీస్ శాఖతో అక్రమ కేసులతో వేధిస్తూ పీడిస్తున్నారని..కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీసు నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో బీఆరెస్ నేతలపై, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారని..ఇలాంటి కేసులకు భయపడేది లేదు.. ఉద్యమం నుంచి వచ్చామని..తమకు కేసులు కొత్త కాదన్నారు. వీటిని ఎదుర్కొంటామని.. భయపడేది లేదు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.