Nara Devansh| నారా దేవాన్ష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు..చంద్రబాబు ప్రశంస

లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్ లో జరిగిన 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025' అవార్డు వేడుకలలో నారా దేవాన్ష్‌ ' ఫాస్టెస్టు చెక్ మేట్ సాల్వర్ - 175 పజిల్స్' అవార్డు అందుకున్నాడు. దేవాన్ష్‌కు అవార్డు, సర్టిఫికెట్ , ట్రోఫీలు అందజేశారు. దేవాన్ష్‌కు “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వ్” అవార్డ్ దక్కడం పట్ల తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేష్, తాత ఏపీ సీఎం నారా చంద్రబాబులు ఎక్స్ వేదికగా అభినందించారు.

Nara Devansh| నారా దేవాన్ష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు..చంద్రబాబు ప్రశంస

అమరావతి : లండన్‌లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025’ అవార్డు(World Book of Records London) వేడుకలలో నారా దేవాన్ష్‌(Nara Devansh) ‘ ఫాస్టెస్టు చెక్ మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ (Fastest Checkmate Solve 175 puzzles record)అవార్డు అందుకున్నాడు. గత ఏడాది చెక్ మేట్ మారథాన్ లో 175 చెక్ మేట్ సవాళ్ల(పజిల్స్)ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పరిష్కరించి దేవాన్ష్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటీవలే దేవాన్ష్ తాత బాలకృష్ణ(Balakrishna)కు సైతం 50ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం దక్కడం గమనార్హం.

లోకేష్..చంద్రబాబుల ప్రశంసలు

దేవాన్ష్‌కు “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వ్” అవార్డ్ దక్కడం పట్ల తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokes) తాత ఏపీ సీఎం నారా చంద్రబాబు(Chandrababu Naidu)లు ఎక్స్ వేదికగా అభినందించారు. దేవాన్ష్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమన్న నారా లోకేష్ పేర్కొన్నారు. నెలల తరబడి పట్టుదల..అతని గురువుల మార్గదర్శకత్వం తర్వాత 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా దేవాన్ష్ సాధించిన రికార్డు పట్ల మేము గర్విస్తున్నామని..శుభాకాంక్షలు, ఛాంపియన్! అని చంద్రబాబు తన మనవడు(grandson) దేవాన్ష్ ను అభినందించారు.

దేవాన్ష్ కు అవార్డు ప్రధానం

బ్రిటన్ పార్లమెంట్‌కు చెందిన ప్రసిద్ధ స్థలం లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్ లో దేవాన్ష్ కు ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌ -175 పజిల్స్’ అవార్డును ప్రధానం చేశారు. దేవాన్ష్‌కు అవార్డు, సర్టిఫికెట్ , ట్రోఫీలు అందజేశారు. నారా దేవాన్ష్ 9 ఏళ్ల వయసులోనే చెస్ రంగంలో అసాధారణ ప్రతిభ చూపుతున్నాడు. దేవాన్ష్ చెస్ డొమైన్‌లో ఇప్పటికే మరో రెండుప్రపంచ రికార్డులు సాధించాడు. వేగవంతమైన టవర్ ఆఫ్ హనాయ్ సాల్వర్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పరిష్కరించి రికార్డునెలకొల్పాడు. వేగవంతమైన చెస్ బోర్డ్ అరేంజర్గా కూడా నారా దేవాన్ష్ రికార్డు సృష్టించారు.