Narendra Modi record| ప్రధాని మోదీ మరో అరుదైన రికార్డు

ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 8,931 రోజుల పాటు మోదీ (గుజరాత్‌ సీఎం పదవీ కాలం కలిపి) పదవిలో ఉన్నారు.

విధాత : భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పేరు మీద అనేక రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 8,931 రోజుల పాటు మోదీ (గుజరాత్‌ సీఎం పదవీ కాలం కలిపి) పదవిలో ఉన్నారు. ఇంతకుముందు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉంది. ఆయన 8,930 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. నేటితో మోదీ ఈ రికార్డును అధిగమించారు. మార్చి 22 (ఆదివారం) నాటికి గుజరాత్ సీఎంగా(12 ఏళ్ల 227 రోజులు), దేశ ప్రధానిగా(11 ఏళ్ల 299 రోజులు) ప్రభుత్వాధినేత హోదాలలో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేసుకున్నారు. దీంతో పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బద్దలైంది.

తాజాగా ప్రధాని మోదీ డిజిటల్ గానూ కొత్త మైలురాయిని అధిగమించారు. ఇన్ స్టా గ్రామ్ లో మోదీ ఫాలోవర్స్ 100 మిలియన్ లు దాటారు. దాంతో ఇన్ స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడికీ లేని విధంగా మోదీ డిజిటల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను పొందిన తొలి నేతగా మోదీ రికార్డు నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సైతం వెనక్కు నెట్టి ఈ అరుదైన ఘనతను సాధించారు.

ఆయన అధికారిక యూట్యూబ్ చానల్ సబ్‌‌‌‌‌‌‌‌ స్కైబర్ల సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించారు. ప్రధాని మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. మరో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇప్పటికే ఆయనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్లను దాటింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ నిలిచారు.

Latest News