Parliament Winter Session| ప్రారంభమైన పార్లమెంట్ శీతకాల సమావేశాలు
పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19 వరకు 15రోజుల పాటు శీతకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం వైఫల్యాలపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు అస్త్ర, శాస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అటు అధికార పార్టీ ఎన్డీఏ సైతం విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు పదునైన వ్యూహాలతో సిద్దమైంది.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతకాల సమావేశాలు (Parliament Winter Session) ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19 వరకు 15రోజుల పాటు శీతకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం వైఫల్యాలపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA)పక్షాలు అస్త్ర, శాస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఢిల్లీ కాలుష్యం, ఎల్ఐసీని ఆదానికి అప్పగించడం, కార్మిక కోడ్ లు, దేశంలో శాంతిభద్రతలు ఇలా పలు కీలక అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి. అటు అధికార పార్టీ ఎన్డీఏ(NDA) సైతం విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు పదునైన వ్యూహాలతో సిద్దమైంది.
సమావేశాల ప్రారంభ సందర్భంగా మీడియాతో ప్రధాని నరేంద్ర మోదీNarendra Modi speech మాట్లాడారు. శీతకాల సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని అభ్యర్థించారు. రాజకీయ డ్రామాలకు చట్టసభలను వేదికగా చేయకుండా..జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. చట్టసభల్లో డ్రామాలు చేయకుండా.. సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండని సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని..అందుకు అర్దవంతమైన చర్చలు జరుగాలన్నారు. పదేళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆటలను దేశ ప్రజలు నమ్మడం లేదు అన్నారు. మీ ఓటమి.. నిరాశాలకు సమావేశాలను బలి చేయకండిని మోదీ విపక్షాలపై విసర్లు వేశారు. కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యం బలాన్ని నిరూపించారన్నారు. పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదన్నారు. భారత వృద్ధిని ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందన్నారు.
పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు
పార్లమెంటు శీతకాల సమావేశాల్లో మొత్తం 13బిల్లులు ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో 10బిల్లులు స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపకుండా నేరుగా పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులలో అణుశక్తి బిల్లు 2025, విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 సహా 14 కీలక బిల్లులు ఉన్నాయి.. భూ సేకరణను వేగవంతం చేసే జాతీయ రహదారుల సవరణ బిల్లు, కార్పోరేట్ చట్టాల సవరణ బిల్లు, సెక్యూరిటీ మార్కెట్ కోడ్(ఎస్ఎంసీ) బిల్లు, మధ్యవర్తిత్వం బిల్లులోని సెక్షన్ 34వ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram