Minister Ponnam Prabhakar| కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

Minister Ponnam Prabhakar| కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

విధాత, హైదరాబాద్ : పంచాయతీ రాజ్(Panchayat Raj Bill), మున్సిపల్ బిల్లు(Municipal Bill), 42శాతం బీసీ రిజర్వేషన్42% BC reservations అమలు విషయంలో మా ప్రభుత్వానికి న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar)అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ఆయా బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్(KTR) వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అనే ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. తమిళనాడు చెన్నై కేసు విషయంలో గవర్నర్ దగ్గర ఉన్న బిల్లులపై కోర్టు జోక్యం చేసుకుంది.. గడువు పూర్తయితే ఆ బిల్లులు ఆమోదించుకున్నట్టే అని తెలిపిందని గుర్తు చేశారు.

బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని, గతంలో ఉన్న 50 శాతం కాబ్ తొలగించాలని ఆర్డినెన్స్ తెచ్చాం..ఈ రోజు అసెంబ్లీ లో చర్చిస్తున్నాం అని పొన్నం స్పష్టం చేశారు. మేం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే గ్రామీణ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ తరలి వచ్చారన్నారు. అసెంబ్లీ లో జరుగుతున్న చర్చ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సభలో నాయకులు అపశకునంగా మాట్లాడే పద్ధతి మంచిది కాదన్నారు.