Vladimir Putin| పుతిన్ ముందు గర్ల్ ఫ్రెండ్ కు జర్నలిస్టు పెళ్లి ప్రపోజల్!

ఓ యువ జర్నలిస్టు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే తన గర్ల్ ఫ్రెండ్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన వీడియో వైరల్ గా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇయర్ ఎండ్ లైవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు కాస్తా...ఆ యువ జర్నలిస్ట్ వివాహ ప్రతిపాదన వేదికగా మార్చాడు.

Vladimir Putin| పుతిన్ ముందు గర్ల్ ఫ్రెండ్ కు జర్నలిస్టు పెళ్లి ప్రపోజల్!

న్యూఢిల్లీ : ఓ యువ జర్నలిస్టు(journalist) ఏకంగా రష్యా( Russian) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ముందే తన గర్ల్ ఫ్రెండ్ (girlfriend)కు పెళ్లి ప్రపోజల్ (marriage proposal)చేసిన వీడియో వైరల్ గా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇయర్ ఎండ్ లైవ్ ప్రెస్ మీట్( live press conference) నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్  కాస్తా…ఆ యువ జర్నలిస్ట్ వివాహ ప్రతిపాదన వేదికగా మార్చాడు. మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు పుతిన్ వరుసగా జవాబు ఇస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఓ 23 ఏళ్ల యువ జర్నలిస్టు కిరిల్ బజానోవ్ లేచి ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని రాసిన ప్లకార్డును పట్టుకొని..తన గర్ల్ ఫ్రెండ్ ఈ సమావేశం లైవ్ చూస్తుందని చెబుతూ..”ఓల్గా! నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా… నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను” అని అడిగాడు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. ఆయన ఆన్-ఎయిర్ ప్రకటనకు హాలు చప్పట్లు, హర్షధ్వానాలు మారుమ్రోగాయి.

తొలుత జర్నలిస్టు చర్యకు ఆశ్చర్యపోయిన పుతిన్ ఆ వెంటనే సానుకూలంగా స్పందించి ‘మీరు వేచి ఉండవచ్చు, కాని వాయిదా వేయకపోవడమే మంచిదంటూ సూచించారు. టెలివిజన్ లైవ్ లో నాటకీయంగా తనకు పెళ్లి ప్రతిపాదన చేసిన తర్వాత ఓల్గా కూడా పెళ్లికి తన అంగీకారం తెలిపినట్లుగా ఇదే మీడియా సమావేశంలో హోస్ట్‌లు వెల్లడించారు. దీంతో పుతిన్ సహా ప్రేక్షకులంతా మరోసారి ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ వెంటనే బజానోవ్ తమ వివాహానికి పుతిన్‌ను ఆహ్వానించాడు. ఓల్గా, తను ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని, కానీ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకోలేకపోతున్నామని బజానోవ్ తెలిపాడు. వారి ఆహ్వానానికి స్పందించని పుతిన్.. బదులుగా వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. ‘కిరిల్.. యువ కుటుంబాల ఆర్థిక స్థితిగతుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. అది వాస్తవమే.. ఇప్పుడు మనమంతా అతడి పెళ్లికి అవసరమైన విరాళాలు సేకరించాలి’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.