Rains । తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
Rains । తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. ప్రత్యేకించి భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నది. నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి,వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ వర్షాలు మూడు రోజులపాటు కొనసాగుతాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Sahara Desert । ఆ ఎడారిలో అత్యంత అతి భారీ వర్షాలు! వాతావరణ పెను మార్పులకు సంకేతాలా?
Sahara Desert । ఆ ఎడారిలో అత్యంత అతి భారీ వర్షాలు! వాతావరణ పెను మార్పులకు సంకేతాలా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram