Ram Charan- Upasana| టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. ఈ జంట పెళ్లైనప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు.దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారితో చాలా సంతో
Ram Charan- Upasana| టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. ఈ జంట పెళ్లైనప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు.దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారితో చాలా సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. అయితే రామ్ చరణ్ క్రేజ్ ఇటీవల పీక్స్‌కి చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌కి దేశ విదేశాల నుండి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. రీసెంట్గా రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపాసన కూడా హాజరు కాగా, ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే కాస్త లేటుగా ఈవెంట్‌కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. రామ్ చరణ్ స్టేజి మీద కూర్చోగా, ఉపాసన స్టే కింద ఆడియన్స్ లో కూర్చుంది. అయితే ఆ సమయంలో ఉపాసన చరణ్ కి ఏదో నోటితో సైగలు చేస్తుండగా, దానికి రామ్ చరణ్ కూడా ఏదో సైగలు చేస్తూ రిప్లై ఇచ్చాడు. ఒకవైపు కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు వీరిద్దరు ఏవో సైగలు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి ఈ ఇద్దరికి సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ సమయంలో వారిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారా అని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు. ఏది ఏమైన ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 2025 పూర్తయ్యే లోపు మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది రామ్ చరణ్ ప్లాన్. అందుకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు మూడేళ్లు ఏ సినిమా చేయలేదు. 2019లో వినయ విధేయ రామ సినిమా చేయగా, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తోనే పలకరించాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చేస్తుండగా, ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుచ్చిబాబుతో సినిమాను జూన్ నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. సుకుమార్ సినిమాను ఈ మధ్య అఫీషియల్ గా ప్రకటించాడు రామ్ చరణ్. వీలైనంత త్వరగా మూవీని మొదలు పెట్టి పూర్తి చేయాలనేది రామ్ చరణ్ ప్లాన్‌గా చెబుతున్నారు.
Best Couple @AlwaysRamCharan @upasanakonidela 🥹🫶❤️ pic.twitter.com/JFPwmu6KEm
— 𝓢𝔀𝓮𝓮𝓽𝔂 𝓑𝓪𝓫𝓾𝓖𝓸𝓾𝓭 ᴿᶜ (@RC_MSD_) April 16, 2024