Bathukamma Sarees| 22నుంచి రేవంతన్న బతుకమ్మ కానుక “ఇందిరా మహిళా శక్తి చీరలు”

Bathukamma Sarees| 22నుంచి రేవంతన్న బతుకమ్మ కానుక “ఇందిరా మహిళా శక్తి చీరలు”

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల(Bathukamma Sarees) పంపిణీకి నిర్ణయించింది. పండుగ పూట తెలంగాణ ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం నింపే “రేవంతన్న బతుకమ్మ కానుక” గా రెండు చీరలను పంపిణీ చేయనుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పేర్కొంది. “ఇందిరా మహిళా శక్తి చీరలు”(Indira MahilaShakti) పేరుతో గౌరవం, సంతోషం, స్వాభిమానానికి ప్రతీకగా ప్రతి మహిళకు రెండు నాణ్యమైన చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించింది. ఒక్కో చీర రూ.800విలువైనదని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) 65లక్షల చీరలను సెప్టెంబర్ 22నుంచి 30వరకు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆడబిడ్డల బతుకమ్మ వేడుకలకు కొత్త వెలుగు నివ్వడంతో పాటు 6000 మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ చేనేత రంగాన్ని ప్రజాప్రభుత్వం కాపాడుతుందని పేర్కొంది. ఒకవైపు పండుగ ఆనందం..మరోవైపు చేనేతకు ఊపిరి.. ఇదే కాంగ్రెస్ ప్రజా సర్కార్ ప్రత్యేకత అని తెలిపింది.