కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 01 రోజు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) మృతి చెందారు. గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 01 బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వెల్లడించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన ముద్రవేశారు.
3వ తేదీన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళ్తారు. 4వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గం లో పనిచేసారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.