చెరువుల ఆక్రమణలు తొలగించాలి
ప్రకృతిని చెరపడితే ప్రకృతి మనపై ప్రకోపం చూపెడుతుందని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలను ఎలాంటి పరిస్థితిలో సహించేదిలేదన్నారు.

మహబూబాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రతినిధి: ప్రకృతిని చెరపడితే ప్రకృతి మనపై ప్రకోపం చూపెడుతుందని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలను ఎలాంటి పరిస్థితిలో సహించేదిలేదన్నారు. జరిగిన ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటన కొనసాగుతున్నది. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఆకేరు వాగు వంతెన పరిశీలించిన సీఎం రేవంత్. సిరోల్ (మం) పురుషోత్తంగూడెం పంట పొలాలను, సీతారాం నాయక్ తండాలను పరిశీలించారు. అనంతరం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.