Sandeep Reddy Vanga| టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నాడు. చివరిగా యానిమల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. త్వరలో ప్రభాస్తో మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజీ డీన్ గా నటించిన వ్యక్తి ఆదిల్ హుసేన్...కబీర్ సింగ్ సినిమా
Sandeep Reddy Vanga| టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నాడు. చివరిగా యానిమల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. త్వరలో ప్రభాస్తో మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజీ డీన్ గా నటించిన వ్యక్తి ఆదిల్ హుసేన్…కబీర్ సింగ్ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని ఇటీవల జరిగిన రేడియో టాక్ షోలో అన్నాడు. చిత్రంలో తాను డీన్ పాత్ర వేశానని, మొదట్లో తాను ఆ పాత్ర చెయ్యను అని చెబితే పారితోషికం ఎక్కువ ఇస్తామని అన్నారు.
అయితే నా పాత్రకి సంబంధించి ఒక్క రోజు మాత్రమే షూటింగ్ ఉంటుందని చెప్పారు.అందుకే చేశాను. అయితే సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్రకు చాలా పేరు వస్తుందని, సినిమా కూడా బాగుంటుందని నేను భావించాను. అయితే తర్వాత ఆ సినిమా చూసి తాను ఎందుకు ఆ పాత్ర చేశానా అని ఇప్పటికీ బాధపడుతుంటాను ఆదిల్ హుస్సేన్ అన్నారు. స్నేహితుడితో సినిమా చూశానని, కానీ మధ్యలోనే బయటకి వచ్చేశాను అని, తన భార్యకి ఈ సినిమా చూడవద్దు అని చెప్పినట్టు కూడా ఆదిల్ హుస్సేన్ స్పష్టం చేశారు. అయితే ఆదిల్ చేసిన వ్యాఖ్యలకి సందీప్ రెడ్డి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘ఎక్స్స లో.. “మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలలో రాని గుర్తింపు, విజయాన్ని మీరు ఎందుకు ‘ఈ సినిమాలో నటించానా’ అనే ఈ ఒక్క సినిమా వచ్చింది అని అన్నారు.
అసలు నేను కూడా మిమ్మల్ని నా సినిమాలో ఎందుకు తీసుకున్నానా అని ఇప్పుడు బాఢపడుతున్నాను. మీరు ఏ మాత్రం సిగ్గుపడక్కర్లేదు. మీ మొహాన్ని ఏఐ సహాయంతో నేను మార్చేస్తా, అప్పుడు మీరు హాయిగా నవ్వుకోవచ్చు అంటూ అతనికి దిమ్మతిరగే సమాధానం ఇచ్చారు. మరి దీనిపై ఆదిల్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. ఇక ఆదిల్ హుస్సేన్ ఇంతకు ముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అందులో ‘ఇంగ్లీష్ వింగ్లిష్’, ‘ఏజెంట్ వినోద్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘కాంచి: ది అన్ బ్రేకబుల్’, ‘బెల్ బాటమ్’, ‘పరీక్ష’, ‘సార్జెంట్’ లాంటి సినిమాలు చేసి మెప్పించే ప్రయత్నం చేశారు. కాని ఏ సినిమాతోను ఆయనకి ప్రత్యేక గుర్తింపు రాలేదు.