Spirit | జులపాల జుట్టు, గాయాల శరీరం, సిగార్ స్టైల్.. ‘స్పిరిట్’ పోస్టర్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ న్యూ ఇయర్ 2026 సందర్భంగా విడుదలైంది

  • By: sn |    movies |    Published on : Jan 01, 2026 7:58 AM IST
Spirit | జులపాల జుట్టు, గాయాల శరీరం, సిగార్ స్టైల్.. ‘స్పిరిట్’ పోస్టర్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ న్యూ ఇయర్ 2026 సందర్భంగా విడుదలైంది. ఈ పోస్టర్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్‌తో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి లుక్ కూడా ఈ పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తోనే హైప్‌ను క్రియేట్ చేసిన మేకర్స్, ఆ తర్వాత వాయిస్ స్టోరీ వీడియో ద్వారా సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొచ్చారు. తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా చూపించడంలో సందీప్ రెడ్డి వంగా సక్సెస్ అయ్యాడు.

‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నాడు. డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ షర్ట్ లేకుండా, జులపాల జుట్టుతో, ఒంటి నిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ పట్టుకొని, నోట్లో సిగార్ పెట్టుకొని ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా దర్శనమిచ్చాడు. ఈ లుక్ చూస్తేనే సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత రా అండ్ వైల్డ్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. సందీప్ రెడ్డి వంగా తన మార్క్ స్టైల్లో ప్రభాస్‌ను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే పోస్టర్‌లో హీరోయిన్ త్రిప్తి డిమ్రి కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌కు సిగార్ వెలిగిస్తూ కనిపించిన త్రిప్తి లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. గ్లామర్‌తో పాటు ఇంటెన్స్ క్యారెక్టర్‌లో త్రిప్తి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.‘‘ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026’’ అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ పోస్టర్‌ను ఎక్స్‌లో షేర్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ప్రభాస్‌ను ఆజానుబాహుడిగా పరిచయం చేస్తూ ఇచ్చిన క్యాప్షన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

‘స్పిరిట్’తో సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ ఖచ్చితంగా భారీ హిట్ కొడుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.‘స్పిరిట్’ అనేది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు తన దైన శైలిలో ప్రభాస్‌ను రా అండ్ బోల్డ్‌గా చూపిస్తూ మరో బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘స్పిరిట్’ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.