Spirit | ‘స్పిరిట్’ షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం.. ప్రభాస్ సేఫ్‌, తాత్కాలికంగా ఆగిన చిత్రీకరణ

Spirit | పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ . ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో అనుకోని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 10, 2026 10:09 AM IST
Spirit | ‘స్పిరిట్’  షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం.. ప్రభాస్ సేఫ్‌, తాత్కాలికంగా ఆగిన చిత్రీకరణ

Spirit | పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ . ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో అనుకోని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో టెంట్లు, అలాగే చిత్రీకరణకు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సామాగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో అక్కడ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

ఒక‌రికి స్వ‌ల్ప గాయాలు..

ఈ ప్రమాదంలో సహాయక బృందానికి చెందిన ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్ర‌భాస్‌ సెట్‌లో లేకపోవడం అందరికీ ఊరటనిచ్చింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ ప్రమాదం కారణంగా షూటింగ్‌కు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

పోలీస్ అధికారి పాత్ర‌లో..

త్వరలోనే మిగిలిన పనులను మళ్లీ ప్రారంభించేందుకు చిత్ర బృందం చర్యలు చేపడుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను T-Series మరియు భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.