six tigers crossing road| అరుదైన అద్బుతం..ఒకేసారి రోడ్డుపై ఆరు పులులు

మధ్యప్రదేశ్ లోని బాంధవ్‌గఢ్‌లోని జాతీయఉద్యనవనంలో ఒకేసారి ఆరు పెద్ద పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆరు పులులు గుంపుగా రోడ్డు దాటాయి.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 22, 2026, 3:12 pm IST
Read Time: 3 mins
six tigers crossing road| అరుదైన అద్బుతం..ఒకేసారి రోడ్డుపై ఆరు పులులు

విధాత, హైదాబాద్ : వన్యప్రాణుల సంరక్షణకు, ముఖ్యంగా పెద్ద పులుల పరిరక్షకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో క్రమంగా వాటి సంఖ్య పెరుగుతుంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులు, అభయారణ్యాలు, కారిడార్ లతో పెద్ద పులుల మనుగడకు సమస్యలు తొలగి వాటి సంతతి వృద్ది చెందుతుంది. అయితే ఒకేసారి ఆరు పెద్ద పులులు రోడ్డు దాటుతున్న అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని బాంధవ్‌గఢ్‌లోని జాతీయఉద్యనవనంలో ఒకేసారి ఆరు పెద్ద పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆరు పులులు గుంపుగా రోడ్డు దాటాయి. మొదట మూడు రోడ్డును దాటగా, దాని తర్వాత మరో మూడు పులులు రోడ్డు దాటాయి.  అడవిలో ఆధిపత్యం కోసం పరస్పరం పోరాటాలకు దిగే పులులు ఇలా ఉమ్మడిగా రోడ్డు దాటడం అద్బుతంగా కనిపించింది. అక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ చిత్రాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వైరల్ గా మారాయి.